Advertisementt

నవదర్శకులతో సీనియర్‌స్టార్‌..!

Wed 10th Feb 2016 01:49 PM
venkatesh,babu bangaram,nenu sailaja,soggade chinni nayana  నవదర్శకులతో సీనియర్‌స్టార్‌..!
నవదర్శకులతో సీనియర్‌స్టార్‌..!
Advertisement
Ads by CJ

ఆమధ్య వరకు విక్టరీ వెంకటేష్‌ సీనియర్‌ దర్శకులతో, అనుభవం ఉన్న దర్శకులతో మాత్రమే ఎక్కువగా చిత్రాలు చేసేవాడు. కానీ ఈమద్య ఆయన తన రూట్‌ మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌కు అవకాశం ఇస్తూ.. తనను వారైతేనే సరికొత్తగా ఆవిష్కరించగలరని నమ్ముతున్నాడు. ఇటీవల ఆయన శ్రీకాంత్‌ అడ్డాల, గోపీచంద్‌ మలినేని, డాలీ, శ్రీప్రియ వంటి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాడు. తాజాగా కూడా ఆయన అదే రూట్‌ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పేరు 'బాబు బంగారం'. కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక 'నేను..శైలజ' దర్శకుడు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. తనకు సరిపడే...తనను కొత్తగా చూపించే కథలను తీసుకొచ్చిన దర్శకులకు అవకాశం ఇస్తూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈ విషయంలో విక్టరీ వెంకటేష్‌ తీసుకున్న నిర్ణయం సరైన ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో వెంకీ ఉన్నాడు. మొత్తానికి ఆయన కూడా నాగ్‌ రూటులోకి వచ్చి మరలా 'సోగ్గాడే చిన్నినాయన' తరహాలో ఓ బ్లాక్‌బస్టర్‌ కొట్టి 40కోట్ల క్లబ్బులో స్థానం సంపాదించుకోవాలనే కసితో పనిచేస్తున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ