Advertisementt

పవన్‌ బిజీ..బిజీ...!

Thu 11th Feb 2016 11:23 AM
pawan kalyan,sardhar gabbar singh,april 8th release,bobby  పవన్‌ బిజీ..బిజీ...!
పవన్‌ బిజీ..బిజీ...!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజాచిత్రం 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'లో చాలా ప్రత్యేకతలు రోజురోజుకు యాడ్‌ అవుతున్నాయి. ఈ చిత్రంతో పవన్‌ తొలిసారిగా ఆయన కెరీర్‌లోనే రెండు యూనిట్లతో వర్క్‌ చేస్తున్నాడు. రెండు యూనిట్స్‌ ఒకేసారి వర్క్‌ చేస్తున్నాయి. మెయిన్‌ యూనిట్‌ మేజర్‌ నటీనటులు అందరితో సీన్స్‌ను చిత్రీకరిస్తోంది. దర్శకుడు బాబి దీన్ని హ్యాండిల్‌ చేస్తున్నాడు. రెండో యూనిట్‌ సినిమాలో పెద్దగా ప్రాముఖ్యం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ యూనిట్‌కు ఇంచార్జ్‌గా కోడైరెక్టర్‌ ఉండి చూసుకుంటున్నాడు. ఇలా రెండు యూనిట్లతో ఎందుకు వర్క్‌ చేయల్సివస్తోంది అంటే... ఏప్రిల్‌ 8వ తేదీన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలనే పట్టుదలతో పవన్‌ ఉన్నాడని అంటున్నారు. మార్చి మొదటివారానికి షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభించాలని పవన్‌ ఆర్డర్‌ వేశాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ