Advertisementt

ఇంకో రీమేకా వెంకీ సార్?

Thu 11th Feb 2016 05:07 PM
venkatesh,two countries remake,bandla ganesh babu  ఇంకో రీమేకా వెంకీ సార్?
ఇంకో రీమేకా వెంకీ సార్?
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్ అంటే రీమేకుల మీద తెగ ఇంటరెస్ట్ చూపిస్తుంటారు. మొన్న హింది చిత్రం ఓహ్ మై గాడ్ రీమేక్ గోపాలా గోపాలా తరువాత బిగ్ బ్రేక్ తీసుకున్న వెంకీ సార్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో బాబు బంగారంతో బిజీ ఉన్నారు. ఇంతలోనే మరిన్ని ప్రాజెక్టులు సంతకం చేసే పనిలో కూడా పడ్డారు. తాజా సమాచారం ప్రకారం బండ్ల గణేష్ బాబు భారీ సొమ్ములు పోసి కొనుక్కున్న టూ కంట్రీస్ మలయాళం టు    తెలుగు రీమేక్ చిత్రంలో వెంకటేష్ నటించే అవకాశాలు ఉన్నాయట. రొమాంటిక్ కామెడీగా నటనకు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రం మాతృకలో దిలీప్ హీరోగా చేస్తే మమతా మోహన్ దాస్ హీరోయిన్. ఎలాగైనా విదేశాలలో సెటిల్ అవాలనుకున్న ఓ పెళ్లి కాని ప్రసాద్ లాంటి హీరో కెనడా నుండి వచ్చిన హీరోయినుని పటాయించి, ప్రేమించి, పెళ్లి చేసుకోవడం. అటు తరువాత ఇక్కడ మన దేశంలోనూ, అక్కడ పరాయి దేశంలోనూ వీరిద్దరి మధ్య వచ్చే ఫన్నీ తగువులాటలే సినిమా ఇతివృత్తం. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిన వాళ్ళయితే అతడే బెస్ట్ చాయిస్ అని చెబుతున్నారు. బండ్ల బాబు మనసులో కూడా వెంకీయే ఉంటె తొందరలోనే సినిమా సెట్స్ మీదకి వెళ్ళడం ఖాయం!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ