Advertisementt

బాలయ్యను బాగా వాడేస్తున్నారు!

Thu 11th Feb 2016 05:10 PM
balakrishna,krishna gaadi veera prema gaadha,nani  బాలయ్యను బాగా వాడేస్తున్నారు!
బాలయ్యను బాగా వాడేస్తున్నారు!
Advertisement
Ads by CJ

కృష్ణగాడి వీరప్రేమగాధలో వీరం, ప్రేమ ఎంత ఉంటాయో తెలియదు గానీ బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం అమాంతంగా ఈ సినిమాతో ప్రేమలో పడిపోయారు. బాలయ్య పేరు చెబితేనే ఊగిపోయే అభిమానులు ఇంకా ఉన్నారు కాబట్టే లెజెండ్, సింహాలు మనం అనుకునే మామూలు పాపులారిటీని మించి సూపర్ హిట్టయ్యాయి. హిందూపురం, అనంతపురం లాంటి ఏరియాలలో అయితే నటసింహం పేరు చెబితే ప్రాణాలు ఇచ్చే వాళ్ళున్నారు. ఈ సెంటిమెంట్ ప్రధానంగానే హీరో నాని పాత్రను సినిమాలో డిజైన్ చేసారు దర్శకుడు హను రాఘవపుడి. చెయ్యి మీద జై బాలయ్య పచ్చబొట్టుతో నాని పోస్టర్ బయటకి రాగానే నందమూరి అభిమానుల్లో ఈ చిత్రం గురించి చర్చలు మొదలయ్యాయి. అటు తరువాత హీరో నాని కూడా చిత్రంలోని తన పాత్ర తాలూకు బాలయ్య అభిమానిని అని చెప్పుకునే కొన్ని క్లూస్ ఇంటర్వ్యూలో వదలడం, అలాగే లెజెండ్ పోస్టర్ మీదున్న బాలకృష్ణకు నాని సెల్యూట్ చేసే టీజర్ బిట్ సైతం యూ ట్యూబులో రావడంతో ఇక నటసింహం ఫ్యాన్స్ హడావిడి విపరీతమైంది. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఫస్ట్ డే టిక్కెట్టు కొనే ఆడియెన్సులో బాలకృష్ణ అభిమానులే ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ