Advertisementt

మరోసారి అక్షయ్‌ రెడీ..!

Fri 12th Feb 2016 05:13 PM
akshay kumar,air lift movie,rusthum,neeraj pandey  మరోసారి అక్షయ్‌ రెడీ..!
మరోసారి అక్షయ్‌ రెడీ..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ అంటే స్పీడుగా చిత్రాలు పూర్తి చేయడంలో స్పెషలిస్ట్‌ అనే పేరుంది. కాగా ఆయన తన చిత్రాలను రెండూ మూడు నెలల్లోనే పూర్తి చేస్తుంటాడు. కాగా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌-నీరజ్‌పాండేల కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 'బేబి, స్పెషల్‌ చబ్బీస్‌' చిత్రాలు వచ్చాయి. అలాగే ఇటీవల అక్షయ్‌కుమార్‌ నటించిన 'ఎయిర్‌లిఫ్ట్‌'కు కూడా నిర్మాతల్లో నీరజ్‌పాండే ఒకడు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు మరో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం పేరు 'రుస్తుం'. ఇందులో హీరోయిన్‌గా ఇలియానాను ఎంపిక చేశారు. రెండో హీరోయిన్‌గా ఇషాగుప్తాను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నీరజ్‌పాండేతో పాటు అనిల్‌ అంబాని వంటి వారు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా మూడు నెలల్లో పూర్తి చేయాలని అక్షయ్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఒకవైపు శంకర్‌-రజనీల కాంబినేషన్‌లో 'రోబో2.0' చేస్తూనే.. అదే సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి జూన్‌లో రిలీజ్‌ చేయాలనేది అక్షయ్‌ ప్లానింగ్‌గా చెబుతున్నారు. మరి ఈ సారి అక్షయ్‌కుమార్‌-నీరజ్‌పాండేల కాంబినేషన్‌లో వస్తోన్న 'రుస్తుం' ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ