Advertisementt

ఇదీ చిరంజీవి గారి చిరకాల కోరిక!

Sat 13th Feb 2016 06:11 PM
chiranjeevi,sreeja second marriage  ఇదీ చిరంజీవి గారి చిరకాల కోరిక!
ఇదీ చిరంజీవి గారి చిరకాల కోరిక!
Advertisement
Ads by CJ

ఏ తండ్రికైనా కొడుకు మీద కంటే కూతురు మీదే ప్రేమ, మమకారం ఎక్కువగా ఉంటాయి. అందరిలాగే చిన్న కూతురు శ్రీజ అంటే  చిరంజీవికి ప్రాణానికి ప్రాణం. తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా శీరీష్ భరద్వాజతో వివాహం చేసుకోవడంతో తండ్రిగా చిరు తల్లడిల్లిపోయాడు. కుర్రతనంలో, పరిణతి చెందని వయసు మీద చేసే తప్పిదాలు తెలుస్కోవడానికి శ్రీజకు ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే భర్త ఆగడాలతో అలసిపోయిన శ్రీజను అక్కున మళ్ళీ చేర్చుకున్నారు చిరంజీవి. గత కొన్ని నెలలుగా చిరంజీవి ఇంట్లోనే ఉంటోన్న శ్రీజకు సమయం చూసి రెండో వివాహం చేసి ఇల్లు చక్కబెట్టాలన్న ఒక తండ్రి తాపత్రయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి కూడా కూతురుకు నచ్చిన వరుడినే చిరంజీవి ఎంచుకొచ్చారు. తన చిన్ననాటి క్లాస్ మేట్ అండ్ ఫ్రెండ్ కళ్యాణ్ అనే అబ్బాయిని శ్రీజ మార్చి 20 తరువాత ఖరారైన ఓ ముహూర్తంలో వివాహం చేసుకోబోతోంది. చిత్తూరు జిల్లాకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు ఈ కళ్యాణ్. ఘనంగా పెళ్లి జరిపి, ముచ్చటగా శ్రీజను అత్తారింటికి పంపాలన్న చిరంజీవి చిరకాల కోరిక తొందరలోనే నెరవేరబోతోంది. ఒక భాద్యతాయుతమైన తండ్రిగా మెగాస్టార్ ఇంతకన్నా ఏమీ కోరుకోలేడు కదా...   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ