అల్లుఅరవింద్ మాస్టర్ మైండ్‌కి తిరుగుండదన్న సంగతి మరోసారి రుజువైంది. ఆయన సంస్థ నుండి ఇప్పుడు రెండు సినిమాలు వస్తున్నాయి. అల్లుఅర్జున్-బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సరైనోడు'తో పాటు అల్లు శిరీష్ సినిమా కూడా ఆయన సంస్థలోనే తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకుడు. బన్నీ సినిమా అంటే శాటిలైట్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ఈ విషయంలో తిరుగులేదు. 'సరైనోడు'కి అలాంటి డిమాండే ఏర్పడింది. దీన్ని అరవింద్ క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. 'సరైనోడు' కావాలంటే అల్లు శిరీష్ సినిమానీ కొనాల్సిందే అని లింకు పెట్టాడు. ఈ రెండు సినిమాల కోసం ఆయన డిమాండ్ చేస్తున్న మొత్తం 15కోట్లు. బన్నీ సినిమాకి ఇంచుమించుగా 10నుండి 11కోట్ల వరకు డిమాండ్ ఉంటుంది. అంటే శిరీష్ సినిమాని 4కోట్లకు అమ్ముకోవాలనేది అల్లుఅరవింద్ ప్లాన్. విడిగా అయితే అసలు అల్లుశిరీష్ సినిమాకు 50లక్షలు కూడా ఎక్కువే. కానీ ఈ చిత్రాన్ని 'సరైనోడు'తో కలిపి 4కోట్లు అదనంగా వసూలు చేయాలనేది అల్లుఅరవింద్ ప్లాన్. బన్నీ సినిమా కావాలంటే శిరీష్‌నీ భరించాల్సిందే. మరి ఈ రెండు కొనేది ఎవరో వేచిచూడాల్సివుంది..!