అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇది నిజమేనండి. పవన్, చిరంజీవిల మధ్య దూరం నాటినాటికీ పెరుగుతుంది అని ఓ పక్క మీడియా మొత్తం కోడై కూస్తున్నా నా అన్న కూతురు పెళ్ళంటే మా ఇంట్లో పెళ్లి అని అందరూ ఫీలయ్యేలా శ్రీజకు త్వరలో జరగబోయే వివాహం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పవన్ స్వయానా రంగంలోకి దిగుతున్నాడు. మొన్నే చిరంజీవికి కాబోయే అల్లుడు, పెళ్ళికొడుకు కళ్యాణ్ కోసం స్వయంగా పరాయి దేశంలో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సైతం ఆపేసి పవన్ కళ్యాణ్ ఇండియాకి వచ్చాడన్న వార్త మనకు తెలిసిందే. ఇక మనకు తెలియనిది ఏమిటంటే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అన్నాదమ్ముల అనుబంధం కొంత కాలంగా మరింత దృడపడిందన్న పచ్చినిజం. అందుకే పూరి జగన్నాథ్ చేస్తానన్న ఆటో జానీని రోడ్డు మీద లేకుండా చేసి వినాయక్ సీన్లోకి వచ్చేలా చేయడం దగ్గర నుండి ఇప్పుడు కత్తి కథలో చేస్తున్న మార్పులు చేర్పుల వరకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ అయినా సరే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే స్క్రిప్ట్ బైండ్ అయేది అని అందరికీ మొహమాటం లేకుండా చెప్పేవరకు వెళ్ళింది. అన్నయ్య రీ-ఎంట్రీ అంటే మోత మోగిపోవాలి... అందుకోసం తమ్ముడు తహతహలాడుతున్నాడు.