Advertisementt

బూతు దర్శకునితో శింబు..!

Tue 16th Feb 2016 06:23 PM
adhik ravichandran,simbu,gv prakash,idi namma aalu  బూతు దర్శకునితో శింబు..!
బూతు దర్శకునితో శింబు..!
Advertisement
Ads by CJ

తమిళంలో ఈమధ్యకాలంలో వచ్చి సూపర్‌హిట్‌ అయిన చిత్రం 'త్రిష ఇల్లానా నయన్‌తార'. ఈ చిత్రం పూర్తి ద్వందార్థంతో నడుస్తూ యూత్‌ను ఆకట్టుకుంది. ఈ చిత్రం దర్శకుడు ఆ ఉత్సాహంతో పెద్ద హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరుగుతున్నాడు. తాజాగా ఆయన ఓస్టార్‌ హీరోని పట్టుకున్నాడు. అతను ఇంకెవరో కాదు శింబు. బీప్‌సాంగ్‌ అంటూ ఓ బూతు పాటతో తమిళనాట సంచలనం క్రియేట్‌ చేసి, అరెస్ట్‌ వారెంట్‌ దాకా వెళ్లి పీకల దాకా ఇరుక్కుపోయి బయటపడిన శింబు ఇప్పుడు ఈ దర్శకునితో సినిమా ఓకే చేసి వార్తల్లో నిలిచాడు. మరి ఈ సినిమాలో ఏ రేంజ్‌లో బూతు ఉంటుందో అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. అసలే ఈ మధ్యకాలంలో బూతు పాటతో సమస్యల్లో ఇరుకున్న శింబు ఈ ప్రాజెక్ట్‌ ఓకే చేయడం చర్చనీయాంశం అయింది. శింబు, నయనతార జంటగా నటించిన 'ఇదు నమ్మ ఆలు' చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో తన తర్వాతి చిత్రంపై శింబు దృష్టి సారించాడు. 'త్రిష ఇల్లానా నయన్‌తార' చిత్ర దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో నటించడానికి శింబు కమిట్‌ అయినట్లు సమాచారం. ఈ చిత్రంలో శింబు మూడు వైవిధ్యమైన గెటప్‌లతో కనిపంచనుండగా, ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఈ నిమిత్తం పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు. శింబు చిత్రాలన్నింటిలో ఇదే భారీ బడ్జెట్‌ సినిమాగా నిలవనుందని, ఆస్థాయిలో ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ