Advertisementt

సెన్సారు వారిని పడేసారు!

Wed 17th Feb 2016 09:20 AM
padesave,censor certificate,  సెన్సారు వారిని పడేసారు!
సెన్సారు వారిని పడేసారు!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున గారి ప్రోత్సాహంతో అన్న సింగిల్ ట్యాగ్ వాడుకుంటూ మన ముందుకు రాబోతున్న ఓ చిన్న చిత్రం పడేసావే. అన్నపూర్ణ కాంపౌండుతో మంచి అనుబంధం కలిగిన చునియా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నటిస్తున్న కార్తీక్ రాజు, నిత్య శెట్టిలు కూడా కొత్తవారే. అయినా సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్, నాగ్ పేరుతో ఈ చిన్ని చిత్రానికి గట్టి మైలేజ్ దొరికింది. ముక్కోణపు ప్రేమ కథగా, యూత్ ఆడియెన్సును దృష్టిలో పెట్టుకొని రూపొందిన పడేసావే ఈ నెల 26న విడుదల కానుంది. ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ U సర్టిఫికేట్ కూడా సంపాదించింది. సినిమాలో కంటెంట్ చానా ఫ్రెష్షుగా ఉందంటూ సెన్సార్ సభ్యులు కూడా కితాబు ఇచ్చారట, సరేమరి, సెన్సార్ వారైతే పడిపోయారు కదా... ఇక మీరు పడేసావేతో తదుపరి పడేయాల్సింది జనాన్నే.