Advertisementt

'గబ్బర్‌సింగ్‌' ఫార్ములానే 'సర్దార్' లో కూడా!

Wed 17th Feb 2016 02:25 PM
sardaar gabbar singh,gabbar singh,anthyakshari,pawan kalyan,mega family  'గబ్బర్‌సింగ్‌' ఫార్ములానే 'సర్దార్' లో కూడా!
'గబ్బర్‌సింగ్‌' ఫార్ములానే 'సర్దార్' లో కూడా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి బాబి దర్శకుడు కాగా, సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్‌ అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో ని మార్చి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి జరుగుతున్న బిజినెస్‌ దృష్ట్యా ఈ చిత్రం ఆడియో వేడుకకు కోటి పాతిక లక్షలు బడ్జెట్‌ కేటాయించారట. ఆడియో ఫంక్షన్‌ను మెగా బ్రదర్స్‌ అయిన చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్‌ల సమక్షంలో జరపాలని పవన్‌ ఆల్‌రెడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని నిరూపించాలని పవన్‌ నిర్ణయించినట్లు సమాచారం. మెగా ఆడియో ఫంక్షన్‌గా ఈ వేడుక కలకాలం నిలిచిపోవాలని పవన్‌ భావిస్తున్నాడట. పవన్‌ ఆంతర్యం ప్రకారం ఈ చిత్రం ఆడియో వేడుకకు కేవలం మెగా హీరోలైన కొణిదల వంశం వారినే పిలవాలని, అల్లుఅరవింద్‌, అల్లుఅర్జున్‌, అల్లు శిరీష్‌ వంటి వారిని ఆహ్వానించకూడదని పవన్‌ నిర్ణయంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌ నడుస్తోంది. కాగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం విషయంలో మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌చేస్తోంది. 'గబ్బర్‌సింగ్‌' చిత్రంలో అంత్యాక్షరి ఎపిసోడ్‌ ఎవ్వరూ మర్చిపోరు. పది నిమిషాల పాటు హిలేరియస్‌గా సాగింది ఆ నవ్వుల ప్రయాణం. ఆ సినిమాకి రిపీటెడ్‌ ఆడియెన్స్‌ వచ్చారంటే అందుకు ఒకానొక కారణం అంత్యాక్షరి ఎపిసోడ్‌. ఆ తర్వాత కనీసం డజను సినిమాల్లో ఇదే ఫార్మాట్‌ ఫాలో అయిపోయారు. కానీ... ఎవ్వరికీ ఫలితం దక్కలేదు. అయితే మరోసారి పవన్‌ ఈ స్ట్రాంగ్‌ పాయింట్‌నే నమ్ముకున్నాడని టాక్‌. 'గబ్బర్‌సింగ్‌'లోలా ఓ భారీ అంత్యాక్షరి ఎపిసోడ్‌ ఈ సినిమాలో పవన్‌ ప్లాన్‌ చేశాడట. ఇప్పుడు అందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందిట. 'జబర్దస్త్‌' బ్యాచ్‌తో పాడిస్తున్న ఈ నవ్వుల కోలాహలం 'గబ్బర్‌సింగ్‌'లోని అంత్యాక్షరిని మించి పోయేలా ఉంటుందని టాక్‌. సినిమా జయాపజయాల్లో ఈ ఎపిసోడ్‌ కీలకం అవుతుందని, డైలాగులతో పాటు అంత్యాక్షరి పాటల ఎన్నిక గురించి కూడా పవన్‌ దగ్గరుండి రాయిస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ సారి ఈ ఎపిసోడ్‌ ఎంతలా పేలుతుందో వేచిచూడాలి! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ