ఏప్రిల్ 8న నేను వచ్చేస్తున్నా అంటూ అల్లు అర్జున్ సరైనోడుతో గట్టిగానే చెప్పుకుని, ఆ దిశగా దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అడుగులు వేస్తుంటే అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సైతం అదే రోజును టార్గెట్ చేసుకుంటూ శరవేగంగా షూటింగ్ పార్టుతో ముందుకు వెళ్తోంది. ఈ సందర్భంలో అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ మధ్య మరోసారి చిచ్చు రగిలే అవకాశం లేకపోలేదంటూ మీడియాలో వార్తలు వస్తున్న దరిమిలా అటువంటిది ఏమి లేదని తెలిసింది. సర్దార్ అయినా సరైనోడు అయినా, ఎవరు ముందుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజుకు సిద్ధంగా ఉంటారో వారే ముందు బయటికి వచ్చేస్తారు. నిజానికి సర్దార్ షూటింగ్ సింహభాగం పెండింగ్ ఉండడం ఒక సమస్యే అయినా, అనుకున్న తేదీకి సర్వం సన్నద్ధం అయిపోతే సరైనోడుని వెనక్కి నెట్టడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అల్లు అరవింద్ మిత్రులతో చెప్పుకుంటున్నారు. అభిమానులు కూడా కనీసం రెండు వారాలు రెండింటి మధ్య గ్యాప్ ఉంచితే మంచిదని భావిస్తున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అల్లు అరవింద్, అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.