సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో వస్తోన్న సినిమా 'కృష్ణాష్టమి'. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 19 న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దిల్ రాజు మీడియాను టార్గెట్ చేస్తూ నేరుగా వారిపై కౌంటర్లు వేయడం మొదలుపెట్టాడు. 'బొమ్మరిల్లు','కొత్తబంగారు లోకం' చిత్రాలకు మాత్రం అన్ని వెబ్ సైట్లు 4.25, 4 రేటింగ్స్ ఇచ్చారని ఆ తరువాత 4 అని రేటింగ్ ఇచ్చిన సినిమానే లేదని చెప్పారు.
డెబ్బై శాతం ఆడియన్స్ కు సినిమా నచ్చితే అది సూపర్ హిట్ కింద లెక్కే. కాని అలాంటి సినిమాలకు కూడా మంచి రేటింగ్స్ ఇవ్వట్లేదని.. ఇక నుండి తన సినిమాల రివ్యూలను తనే సినిమా రిలీజ్ ముందు రోజు రాసి ప్రేక్షకులకు చేరవేస్తానని తెలియజేశారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వారు సినిమా చూసి దాని గురించి రాసేస్తున్నారు కాని తమను తాము ఎనాలసిస్ చేసుకొని రాస్తే బావుంటుందని సజెషన్స్ కూడా ఇచ్చారు. 99 శాతం సినిమా బావుంటే ఎవరు రివ్యూలను పట్టించుకోరని చెప్పుకొచ్చారు. అంతేకాదు సెలబ్రిటీల మీద మీడియా రాసే గాసిప్స్ అసలు చదవనని చెప్పాడు. తనపై ఎలాంటి గాసిప్స్ వచ్చినా.. పట్టించుకోడట. అసలు వెబ్ సైట్స్ చూడని మనిషి దానిలో వచ్చే రివ్యూల గురించి మాత్రం ఎందుకింత క్లాస్ పీకాడో.. ఆయనకే తెలియాలి!