Advertisementt

చిన్న సినిమాలకు.. మార్చి వరకే ఛాన్స్!

Thu 18th Feb 2016 05:18 PM
small budget movies,malupu,krishnasthami,tuntari,shourya,marchi ending  చిన్న సినిమాలకు.. మార్చి వరకే ఛాన్స్!
చిన్న సినిమాలకు.. మార్చి వరకే ఛాన్స్!
Advertisement
Ads by CJ

ఏప్రిల్‌ నుండి మరలా పెద్ద పెద్ద స్టార్స్‌ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. దాంతో ఈ వారం నుండే చిన్న సినిమాల జాతర మొదలుకానుంది. తమ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి చివరి వారంలోపు విడుదల చేయాలని చిన్న నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో ఇక మార్చి చివరి వరకు వారానికి రెండు మూడు చిన్న చిత్రాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. ఈ  శుక్రవారం సునీల్‌ -దిల్‌రాజు- వాసువర్మల కాంబినేషన్‌లో రూపొందిన 'కృష్ణాష్టమి' చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్‌ యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఇక అదే రోజున ఆది పినిశెట్టి నటించిన 'మలుపు', జయం రవి నటించిన 'యమపాశం' విడుదలకు రెడీ అయ్యాయి. ఇక ఫిబ్రవరి 26న 'మాకు మేమే... మీకు మీరే..' చిత్రంతో పాటు 'పడేసావే',  పివిపి సంస్థ నిర్మించిన 'క్షణం' చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక మార్చి 4వ తేదీన అయితే చిన్న చిత్రాల మధ్య మంచి పోటీ ఏర్పడనుంది. ఆ రోజున 3 చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. మంచు మనోజ్‌ నటించిన 'శౌర్య',, నాగశౌర్య హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'కళ్యాణవైభోగమే', నారా రోహిత్‌ 'తుంటరి' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. ఇలానే మార్చి చివరి వారం వరకు వారానికి రెండు మూడు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ