ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడంతో పవన్ ఆర్డర్ వేసిన దానికి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని వేగంగా చిత్రీకరిస్తున్నారు. మరో భాషలో చెప్పాలంటే వీలున్నంత త్వరగా చుట్టేస్తున్నారు. దీంతో ఇది ఈ చిత్ర యూనిట్‌తో పాటు పవన్‌ను కూడా టెన్షన్ పెడుతోంది. ఇటీవలే కేరళ షెడ్యూల్‌ను ముగిన్చుకుని వచ్చిన ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీతో పాటు సంఘీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో పవన్‌కళ్యాణ్, బ్రహ్మానందంలపై కొన్ని కీలక సన్నివేశాలను, కామెడీ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు బాబి. ఇక ఈ చిత్రంలోని కొన్ని రొటీన్ సన్నివేశాలను, కీలకం కాని సన్నివేశాలను కోడైరెక్టర్ ఆధ్వర్యంలో రెండో యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇలా 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను ఏప్రిల్ 8కి డెడ్‌లైన్ పెట్టుకొని, హడావుడిగా చిత్రాన్ని చుట్టేసే పనిలో యూనిట్ రాత్రింబవళ్లు పనిచేస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం యూనిట్ రెండు పాటల చిత్రీకరణ కోసం యూరప్‌కు వెళ్లనుంది. పవన్ బాధ ఇదైతే మహేష్‌బాబు బాధ మరో విధంగా ఉంది. ప్రస్తుతం మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న 'బ్రహ్మూెత్సవం' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్‌కు చెప్పిన కథ ఒకటైతే, అందుకు ఏమాత్రం పొంతనలేని సీన్స్‌ను తెరకెక్కిస్తూ విసిగిస్తునాడట. షూటింగ్ స్పాట్‌కు వచ్చే సరికి కన్‌ఫ్యూజన్‌కు గురవుతున్న ఈ దర్శకుడు పేపర్‌పై ఉన్న సీన్స్‌కు తీస్తున్న సీన్స్‌కు అసలు పొంతనే లేకుండా ఉండటం, షూటింగ్ పూర్తయ్యే సరికి సినిమా నిడివి నాలుగు గంటలు వచ్చే అవకాశం ఉండటంతో మహేష్ శ్రీకాంత్ అడ్డాలపై ఆగ్రహంగా ఉన్నాడని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ టాప్‌స్టార్స్ అయిన పవన్, మహేష్‌లు ప్రస్తుతం తాము చేస్తున్న చిత్రాల విషయంలో గజిబిజీగా ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్.