కోలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో జీవా. ఈయన 'రంగం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. కాగా స్టార్‌హీరో కావాలని కలలు కంటున్న జీవా అందుకోసం ఓ దగ్గరి మార్గం చూసుకుంటున్నాడు. తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా తన మార్కెట్‌ను పెంచుకోవడం కోసం కోలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్‌హీరోయిన్ల సాయం తీసుకుంటున్నాడు. ఇలా ఆయన సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లను ముగ్గులోకి లాగుతూ, స్టార్ హీరోయిన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న 'తిరునాల్' సినిమాలో ఆయన నయనతారతో కలిసి నటిస్తున్నాడు. ఇక 'పోక్కిరి రాజా' చిత్రంలో హన్సికతో రొమాన్స్ చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్‌తో 'కాదలై వేండం' చిత్రం చేస్తున్నాడు. ఇక తాజాగా ఆయన కాళేశ్వర్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో కూడా పాపులర్ హీరోయిన్ అయిన మిల్కీబ్యూటీ తమన్నాను తనకు జోడీగా ఎంచుకున్నాడు. ఇలా తన ఇమేజ్ పెంచుకునే క్రమంలో ఆయన స్టార్‌హీరోయిన్ల క్రేజ్‌ను వాడుకొంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి జీవా వేసిన ఈ స్కెచ్ వర్కౌట్ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది...!