Advertisementt

బాలీవుడ్‌లో బిగ్‌ఫైట్‌కి తెరలేవనుంది..!

Fri 19th Feb 2016 04:55 PM
shah rukh khan,raees,salman khan,sulthan movie  బాలీవుడ్‌లో బిగ్‌ఫైట్‌కి తెరలేవనుంది..!
బాలీవుడ్‌లో బిగ్‌ఫైట్‌కి తెరలేవనుంది..!
Advertisement
Ads by CJ

ఇటీవలే షార్‌ఖ్‌ఖాన్‌ నటించిన 'దిల్‌వాలే' చిత్రం 'బాజీరావు మస్తానీ' చిత్రంతో పోటీపడి బాగా దెబ్బతింది. అయినా కూడా షారుఖ్‌ మరోసారి దీనికి మించిన పోటీకి రెడీ అవుతున్నాడు. ఈద్‌ పండగ నాడు ఈ పోటీ మొదలుకానుంది. తాజాగా సల్మాన్‌ఖాన్‌ హీరోగా యశ్‌రాజ్‌ సంస్థ నిర్మిస్తున్న 'సుల్తాన్‌' చిత్రం ఈద్‌ పండగకు విడుదలకు సిద్దమవుతోంది. అదే రోజు షారుఖ్‌ఖాన్‌ హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న 'రాయీస్' చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. దీంతో బాలీవుడ్‌లో బిగ్‌ వార్‌కు తెరలేవనుంది. ఈ రెండు చిత్రాలు  రంజాన్‌ కానుకగా విడుదల కానున్నాయని ఆల్‌రెడీ రెండు చిత్రాల నిర్మాతలు అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. మరి నిర్మాతల సంగతేమో గానీ ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలకు సిద్దం అవుతుండటంతో బయ్యర్లు భయపడుతున్నారు. మరి ఈ బిగ్‌ఫైట్‌లో చివరకు విజయం సాధించేది ఎవరో తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్‌ చేయాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ