Advertisementt

సరైనోడుకి సరిపోయాడు!

Sat 20th Feb 2016 06:30 PM
sarainodu,aadi pinisetty,malupu  సరైనోడుకి సరిపోయాడు!
సరైనోడుకి సరిపోయాడు!
Advertisement
Ads by CJ

బోయపాటి సినిమాలలో విలన్లు క్రూరంగా, వికృత చేష్టలతో రక్తం మరిగిన మృగాల్లాగా ఉంటారు. అందుకే బాలకృష్ణ, ఎన్టీయార్... ఇలా ఏ హీరో అయినా బోయపాటి రాసుకునే విలనీ ముందు హీరోయిజం తారా స్థాయికి చేరుతుంది. ఈసారి అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమాలో విలన్ కూడా మరింత కొత్తగా ఉండేందుకు అవకాశం ఎక్కువ. బన్నీ స్టైల్, ఎనర్జీ మొన్న రిలీజయిన ట్రైలర్లో సరిగ్గా కన్పించింది. కానీ ప్రతినాయకుడి మొహం కాకుండా కళ్ళతోనే సరిపెట్టారు బోయపాటి గారు. అవును, మీరనుకున్నది కరెక్టే. ఆ ప్రతినాయకుడు ఎవరో కాదు. ఆది పినిశెట్టి. ఈ కుర్ర హీరోలో విషయం చాలా ఎక్కువ. మేటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకుగా తెరంగేట్రం చేసినా చక్కటి సినిమాలతో తమిళ, తెలుగులలో పేరు సంపాదించాడు. నిన్న రిలీజయిన మలుపు కూడా అతని కెరీరుకు ఉపయోగపడే సినిమానే. ఏదేమైనా మలుపుకు క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ రావడం ఓ రకంగా సరైనోడుకు కూడా ప్లస్సే అవుతుంది. బన్నీ, ఆదిల మధ్య పోరు ఎంత రక్తికడితే సరైనోడు బాక్సాఫీస్ స్థాయి అంత తారాస్థాయికి చేరుతుంది. లెజెండ్ చిత్రంలో బాలయ్య, జగపతి బాబులు పోటాపోటీగా నటించారు. మళ్ళీ బోయపాటి అంతటి స్ట్రాంగ్ ట్రాక్స్ సరైనోడుకు రాసాడని టాక్!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ