Advertisementt

చిరు కొత్తల్లుడు హీరోగా వచ్చేస్తాడా?

Sat 20th Feb 2016 08:00 PM
sreeja husband,kalyan,hero,tollywood  చిరు కొత్తల్లుడు హీరోగా వచ్చేస్తాడా?
చిరు కొత్తల్లుడు హీరోగా వచ్చేస్తాడా?
Advertisement
Ads by CJ

చిరంజీవి రెండో కూతురు శ్రీజ రెండో వివాహానికి సర్వం సన్నద్ధమవుతోంది. మొదటి పెళ్లితో కుటుంబం మొత్తాన్ని కుమిలేలా చేసిన శ్రీజ తప్పు తెలుసుకుని తండ్రి ఒడికి చేరి మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళబోతోంది. చిరంజీవి కుటుంబానికి ఆప్తమిత్రులుగా ఉన్న కెప్టెన్ కిషన్ గారి కొడుకు కళ్యాణ్ ఇప్పుడు కొత్త పెళ్ళికొడుకు. కొద్దిరోజులుగా కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా తిరిగేస్తున్నాయి. కుర్రాడు చూడడానికి పిచ్చ స్మార్టుగా ఉన్నాడు. అందుకేనేమో మెగా అభిమానుల కోరికలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. కళ్యాణ్ లుక్స్ నేటి తరం కుర్ర హీరోలకు ఎంత మాత్రం తీసిపోయేట్టుగా లేవు కాబట్టి చిరంజీవి గారి కొత్తల్లుడు హీరోగా ట్రై చేసుకోవచ్చు అంటున్నారు. మెగా ఫ్యామిలీ అంటే స్టార్ హీరోలకు ప్రసిద్ది. చిరంజీవి గారు వేసిన పునాది మీద ఆ ఫ్యామిలీ మొత్తం స్టార్ ఇమేజి భవనాలు కట్టేసింది. ఒకానొక సమయంలో దివంగత హీరో ఉదయ కిరణ్ నిజానికి చిరంజీవి పెద్దల్లుడు కావాల్సింది. అప్పుడు ఓ హీరోని అల్లుడిగా చేసుకోలేకపోయిన మెగా ఫ్యామిలీ మరీసారి ఓ అల్లుడినే హీరోగా చేసేస్తే ఎలా ఉంటుందో మీరోసారి డ్రీమ్స్ వేసేసుకోండి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సపోర్టు ఉంటె ఇది చాలా వీజీ. కానీ శ్రీజకు కాబోయే ఆయన గారికి అటువంటి ఆలోచనలు ఉన్నాయా లేదా అన్నదే డిస్కషన్!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ