Advertisementt

ఒక హీరోయిన్ ఎమ్మేల్యే మరొకరు ఎంపీ!!

Mon 22nd Feb 2016 04:57 PM
catherine mla,trisha mp,sarrinodu,kodi,heroines,politics  ఒక హీరోయిన్ ఎమ్మేల్యే మరొకరు ఎంపీ!!
ఒక హీరోయిన్ ఎమ్మేల్యే మరొకరు ఎంపీ!!
Advertisement
Ads by CJ

రాజకీయాలపై మన ముద్దుగుమ్మలు మనసు పడుతున్నారు. నిజజీవితంలో ఇప్పటికే ఎందరో ముద్దుగుమ్మలు రాజకీయాలలో తమదైన శైలిని చూపిస్తున్నారు. ఇకపోతే రీల్‌ స్క్రీన్‌లపై కూడా ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలు పాలిటిక్స్‌పై మోజుపడి రాజకీయ వేషాలకు నడుం బిగిస్తున్నారు. అల్లుఅర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సరైనోడు'. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో కేథరిన్‌ ఓ ఎమ్మేల్యే పాత్రలో నటించనుందట. ఇక రాజకీయ నాయకురాలిగా కనిపించనున్న మరో హీరోయిన్‌ త్రిష. ప్రస్తుతం ఆమె ధనుష్‌ హీరోగా దొరైసెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో 'కోడి' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర కథ ప్రకారం ఈ చిత్రంలో త్రిష ఎంపీగా నటిస్తోందని సమాచారం. మొత్తానికి నిజజీవితంలో కాకపోయినా కొందరు హీరోయిన్లు సినిమాలలో తమదైన పొలిటీషియన్‌ పాత్రలను పోషిస్తూ... తమ సరదా తీర్చుకుంటున్నారు. మరి ఈ చిత్రాలలో ఎవరు లేడీ పొలిటీషియన్స్‌గా ఆకట్టుకుంటారో వేచిచూడాల్సివుంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ