Advertisementt

మహేష్ సెట్టయ్యాడు..మరి పవన్‌ సంగతేంటో!

Tue 23rd Feb 2016 12:35 AM
pawan kalyan,srimanthudu,sardaar gabbar singh,sardaar gabbar singh songs shoot start,mahesh babu  మహేష్ సెట్టయ్యాడు..మరి పవన్‌ సంగతేంటో!
మహేష్ సెట్టయ్యాడు..మరి పవన్‌ సంగతేంటో!
Advertisement
Ads by CJ

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం షూటింగ్‌లో బహు క్లిష్టమైన పరిస్థితికి చేరుకున్నాడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. అది మరేదో కాదు.. పాటల చిత్రీకరణ. ఎందుకోగానీ పవన్‌ పాటల చిత్రీకరణ పార్ట్‌ను చాలా కష్టంగా ఫీలవుతాడు. ఇందులో స్టెప్స్‌ వేయాల్సివుంటుంది కాబట్టి తనకు పెద్దగా డాన్స్‌ రాదని, పవన్‌కళ్యాణే స్వయంగా పలు సందర్బాల్లో చెప్పాడు. కానీ అభిమానుల అభిరుచి మేరకు సినిమాలలో పాటలకు స్టెప్పులు వేస్తున్నాడు పవన్‌కళ్యాణ్‌. అందుకోసం తన బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా డాన్స్‌లను కంపోజ్‌ చేయించుకుంటున్నాడట పవర్‌స్టార్‌. ఈ చిత్రంలోని రెండు పాటలను యూరప్‌లో చిత్రీకరించి, మిగిలిన పాటలను హైదరాబాద్‌లోని సెట్స్‌లోనే చిత్రీకరించడానికి రంగం సిద్దమవుతోంది. మరి తన రాబోయే చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో పవన్‌ వేసే స్టెప్పులు అభిమానులను, సాధారణ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచిచూడాల్సివుంది. వాస్తవానికి టాలీవుడ్‌ టాప్‌స్టార్స్‌ అయిన పవన్‌, మహేష్‌ ఇద్దరూ డాన్స్‌లలో బాగా వీక్‌, అల్లుఅర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి వారితో పోల్చుకుంటే పవన్‌, మహేష్‌లు డ్యాన్స్‌ల్లో వీక్‌ అని ఒప్పుకోవాల్సిందే. కానీ మహేష్‌ ఇటీవలకాలంలో బాగా కష్టపడుతూ తన మైనస్‌ పాయింట్‌ను కవర్‌ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే '1'(నేనొక్కడినే), 'ఆగడు' చిత్రాలలో ఆయన ఈ విభాగంలో బాగా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రంలో మహేష్‌ డ్యాన్స్‌లు యాక్టివ్‌గానే చేశాడు. మరి పవన్‌ కూడా ఈ మైనస్‌ను  అధిగమిస్తాడో లేదో 'సర్దార్‌'లో చూడాల్సివుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ