ఒకప్పుడు సౌతిండియాలో షకీలా పేరు వింటే చాలు సినీ ఇండస్ట్రీలు షేకయ్యేవి. ఆమె సినిమా విడుదలవుతుందంటే థియేటర్లల్లో కలెక్షన్ల వర్షం కురిసేది. షకీలా సినిమా విడుదల అవుతోందంటే పెద్ద హీరోల చిత్రాలు సైతం విడుదల చేసేందుకు భయపడేవారు అనే ప్రచారం కూడా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షకీలా ఈ విషయమై స్పందిస్తూ.... అప్పట్లో నేను చేసేవి చిన్న సినిమాలు కాబట్టి ప్రతివారం ఒకటి రిలీజ్ అయ్యేది. కానీ పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి రెండు లేదా మూడు కంటే ఎక్కువ రిలీజ్ అయ్యేవి కావు. దానివల్ల వాళ్ల సినిమాలు లేటుగా వచ్చేవి. అంతేకానీ నా సినిమాలకు పెద్ద హీరోలు భయపడేంత సీన్ లేదు.. అని స్పష్టం చేసింది. నా సినిమాలకు చాలా సెన్సార్ సమస్యలు వచ్చేవి. దాదాపు 23 సినిమాలు సెన్సార్ సమస్యల వల్ల రిలీజ్ కాలేదు. సెన్సార్ సమస్య వచ్చి సినిమా రిలీజ్ కాకపోతే నిర్మాతలు నష్టపోవాల్సివచ్చేది. వరుసగా అలాంటి సమస్యలు రావడంతో నేనే కావాలని ఆ సినిమాలు చేయడం మానేశాను.. అని తెలిపింది. అలాంటి సినిమాల్లో నటిస్తున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? బయటకు వచ్చినప్పుడు జనాల నుండి ఎలాంటి స్పందన వచ్చేది అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెబూతూ.... నేను అసలు బయటకు వచ్చేదాన్ని కాదు. ఒకవేళ వచ్చినా కూడా ఎవ్వరూ నన్ను గుర్తుపట్టకుండా బురఖా వేసుకొని వచ్చేదాన్ని... అంటూ తన మనసులోని విషయాలు తెలిపింది షకీలా....!