Advertisementt

తెలుగులో అర్థంపర్థం లేని టైటిల్స్‌.!

Sun 28th Feb 2016 09:09 PM
telugu cinema titles,premam,prema,kobali,kabali,rajanikanth  తెలుగులో అర్థంపర్థం లేని టైటిల్స్‌.!
తెలుగులో అర్థంపర్థం లేని టైటిల్స్‌.!
Advertisement
Ads by CJ

ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్న చిత్రాలకు అవే పేర్లు పెడుతున్నారు. కానీ అవి అర్థం పర్థం లేకుండా ఉండటం చూస్తే ఇప్పుడు ఇదే ట్రెండ్‌ ఫ్యాషన్‌ అయిపోయిందేమో? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు సినీ విమర్శకులు. ఇలా తెలుగు వారికి అర్థం కాని టైటిల్స్‌ను పెడుతున్నందుకు దుక్కించాలా ? లేక తెలుగు వారికి పరిచయం లేని పదాలను పరిచయం చేస్తున్నందుకు ఆనందపడాలా? అనే విషయం అందరిలో చర్చకు దారితీస్తోంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని తెలుగులో నాగచైతన్యతో రీమేక్‌ చేస్తూన్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రం టైటిల్‌ 'మజ్ను' అనే ప్రచారం జరిగింది. నాగ్‌ టైటిల్‌ కావడంతో ఇది బాగానే సూట్‌ అవుతుందని అందరూ భావించారు. 

కానీ ఈ టైటిల్‌ను పెట్టకుండా మలయాళ టైటిల్‌ అయిన 'ప్రేమమ్‌' టైటిల్‌నే తెలుగులో కూడా పెట్టారు. కనీసం 'ప్రేమ' అనే టైటిల్‌ పెట్టినా బాగుండేదని, ఎన్నో ఏళ్ల కిందట సురేష్‌కృష్ణ దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకటేష్‌, రేవతిల కాంబినేసన్‌లో వచ్చిన టైటిల్‌ కావడంతో ఈ టైటిల్‌ అయినా బాగుండేదని అంటున్నారు. ఇక రజనీకాంత్‌ హీరోగా రంజిత్‌ పా దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న 'కబాలి' తమిళ టైటిల్‌నే తెలుగు వెర్షన్‌కు కూడా ఫిక్స్‌ చేశారు. తెలుగు పదమైన 'కోబలి' అనే పదానికి అర్థమే చాలామంది తెలుగువారికి తెలియదు. అటువంటిది తమిళ జనాలకు మాత్రమే పరిచితమైన 'కబాలీశ్వరన్‌' అనే పేరులోని 'కబాలి'ని తెలుగు ప్రేక్షకులపై రుద్దడం అన్యాయం. ఇక ఇటీవల తెలుగులోకి డబ్‌ అయిన ధనుష్‌ చిత్రం 'మరియన్‌'ను అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్‌ చేశారు. వాస్తవానికి 'మరియన్‌' అంటే తెలుగులో 'అమరం' అని అర్థం. మరి ఆ పేరునైనా పెట్టకుండా 'మరియన్‌' అనే టైటిల్‌నే తెలుగు వెర్షన్‌కు పెట్టడం దారుణమని తెలుగు భాషాభిమానులు మండిపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ