Advertisementt

ప్లానింగ్‌ అంటే ఇది..!

Tue 01st Mar 2016 02:59 PM
kshanam movie,pvp banner,adavi sesh,adah sharma  ప్లానింగ్‌ అంటే ఇది..!
ప్లానింగ్‌ అంటే ఇది..!
Advertisement
Ads by CJ

పివిపి సినిమాస్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ వారు సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్‌ డ్రామా చిత్రం 'క్షణం'. అడవి శేష్, ఆదాశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అనసూయ సరికొత్త పాత్రలో కనిపించింది. రవికాంత్‌ పేరేపు దర్శకునిగా పరిచయం అయిన ఈ చిత్రం ఈ వీకెండ్‌ విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మహేష్‌బాబు, సమంతలు ఈ సినిమాను ప్రమోట్‌ చేయడం, ట్రైలర్స్‌ ఆకట్టుకునే విధంగా ఉండడం, పబ్లిసిటీ కూడా బాగా చేయడంతో మంచి ఓపెనింగ్స్‌ సాధించింది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగు రెట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను కేవలం కోటిరూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే పబ్లిసిటీ కోసం మరో కోటి ఖర్చు చేశారు. ఇలా మొత్తం రెండు కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తయారైంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఓవరాల్‌ రన్‌లో కనీసం 6 నుండి 8కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక శాటిలైట్‌ రూపంలో నిర్మాతలకు మరింత లాభం రాబోతోంది. దీన్ని చూసిన వారు ప్లానింగ్‌ అంటే ఇలా ఉండాలి.....! అనుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ