Advertisementt

రీమేక్‌ చేయనున్న బన్నీ..?

Tue 01st Mar 2016 03:06 PM
allu arjun,kanithan movie remake,arjun kapoor  రీమేక్‌ చేయనున్న బన్నీ..?
రీమేక్‌ చేయనున్న బన్నీ..?
Advertisement
Ads by CJ

సాదారణంగా ఒక భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని మరో భాషలో హీరోలు రీమేక్‌ చేయడం సాధారణమే. కానీ ఓ చిన్న హీరో నటించిన లో బడ్జెట్‌ మూవీని పక్క బాషలోని ఓ స్టార్‌ హీరో రీమేక్‌ చేయడానికి సిద్దం అవుతున్నాడంటే ఆ సినిమా దమ్ము ఏమిటో ఇట్టే అర్థం అవుతుంది. అలాంటి ఆశ్చర్యకర సంఘటనే త్వరలో తెలుగులో జరిగే అవకాశం ఉంది అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. పోయిన శుక్రవారం తమిళంలో 'కనిథన్‌' అనే చిత్రం రిలీజైంది. జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో అధర్వ, కేథరిన్‌ జంటగా నటించారు. ఈ చిత్రం తమిళనాట మంచి కలెక్షన్లు రాబడుతూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ముఖ్యంగా యాక్షన్‌ ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అక్కడ పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం. తెలుగులో ఈ స్టోరీని అల్లుఅర్జున్‌తో చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం లైన్‌ను కూడా బన్నీకి వినిపించారట. బన్నీకి కూడా లైన్‌ బాగా నచ్చిందని సమాచారం. ఇక బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని అర్జున్‌కపూర్‌తో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నారు. అయితే బన్నీ విషయానికి వస్తే ఆయన వరుస కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ చిత్రాన్ని బన్నీకి చూపించనున్నారు. మరి ఈ చిత్రం బన్నీ చేయాలనుకుంటే ఎప్పుడు? ఎవరితో చేస్తాడు? అనేది ఆసక్తికి కలిగిస్తోన్న విషయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ