Advertisementt

ఉత్సాహంగా ఉన్న జగ్గూభాయ్‌...!

Tue 01st Mar 2016 11:18 PM
jagapathi babu,puli murugan,mohan lal,malayalam movie  ఉత్సాహంగా ఉన్న జగ్గూభాయ్‌...!
ఉత్సాహంగా ఉన్న జగ్గూభాయ్‌...!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మరీ ముఖ్యంగా మహిళా లోకాన్ని ఓ ఊపు ఊపిన అందాల నటుడు జగపతిబాబు. హీరోగా ఆయన కెరీర్‌ డౌన్‌ఫాల్‌లో పడిన తర్వాత ఆయన విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు. తన రెండో ఇన్నింగ్స్‌ను ఎంతో జోష్‌తో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన కేవలం తెలుగులోనే గాక తమిళం, కన్నడ భాషా చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకేశాడు. సౌత్‌లో ఇప్పటివరకు తాను నటించని మలయాళ భాషా చిత్రంలో కూడా చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. అది కూడా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో కావడం విశేషం. పులి మురుగన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో జగపతిబాబు మెయిన్‌ విలన్‌ పాత్రను పోషిస్తున్నాడు. మోహన్‌లాల్‌ వంటి సూపర్‌స్టార్‌తో అందునా మలయాళంలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇది తనకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని ఆయన సంతోషపడుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ