Advertisementt

ప్ర‌భాస్ ఆయ‌న‌కి మాటిచ్చాడ‌ట‌!

Wed 02nd Mar 2016 03:50 PM
prabhas,dasarath,shourya,mr perfect movie,prabhas promise to dasarah,bahubali  ప్ర‌భాస్ ఆయ‌న‌కి మాటిచ్చాడ‌ట‌!
ప్ర‌భాస్ ఆయ‌న‌కి మాటిచ్చాడ‌ట‌!
Advertisement
Ads by CJ

'బాహుబ‌లి' సినిమాతో ప్ర‌భాస్ రేంజే మారిపోయింది. ఇక ఆయ‌న భారీ బ‌డ్జెట్టుతో కూడిన  భారీ సినిమాలే చేసే అవ‌కాశాలున్నాయి. అస‌లు 'బాహుబ‌లి 2' త‌ర్వాత బాలీవుడ్ వెళ‌తాడో లేదంటే హాలీవుడ్ దృష్టిలో ప‌డ‌తాడో కూడా తెలియ‌దు. కానీ ఆయ‌న‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు మాత్రం చాలా ఆశ‌లు పెట్టుకొన్నారు. ప్ర‌భాస్‌తో మ‌రో సినిమా చేసి తీర‌తాం అంటున్నారు. అందులో ద‌శ‌ర‌థ్ లాంటి ద‌ర్శ‌కుడు కూడా ఉన్నారు. ప్ర‌భాస్‌తో 'మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌' లాంటి సినిమాని తీశాడు ద‌శ‌ర‌థ్‌. కూల్‌గా, చాలా సాదాసీదాగా  క‌నిపించే ద‌శ‌ర‌థ్ అంటే క‌థానాయ‌కులంతా ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌భాస్‌ది కూడా అదే త‌ర‌హా మ‌న‌స్త‌త్వ‌మే. అందుకే ద‌శ‌ర‌థ్‌, ప్ర‌భాస్ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స‌య్యారు. సినిమాతో సంబంధం లేకుండా త‌ర‌చుగా క‌లుసుకొంటుంటార‌ట‌. మూడు నాలుగు గంట‌లు పిచ్చాపాటిగా మాట్లాడుకొంటూ గ‌డుపుతుంటార‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా చెప్పిన ద‌శ‌ర‌థ్ త్వ‌ర‌లోనే ప్ర‌భాస్‌తో సినిమా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. 'మేం మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకొంటున్నాం. స‌మ‌యం లేక కుద‌ర‌లేదు కానీ.. మ‌ళ్లీ క‌లిసి సినిమా చేయ‌డం మాత్రం ఖాయం. నాకు ప్ర‌భాస్ మాట కూడా ఇచ్చాడు' అని చెప్పుకొచ్చాడు ద‌శ‌ర‌థ్‌. మంచి సినిమాల్ని తీస్తాడ‌నే పేరున్న ద‌శ‌ర‌థ్ ఇటీవ‌ల ఓ థ్రిల్లింగ్ ల‌వ్‌స్టోరీతో శౌర్య తెర‌కెక్కించాడు. మార్చి 4న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న  ఆ సినిమా ఫ‌లితంపైనే ద‌శ‌ర‌థ్ త‌దుప‌రి చేయ‌నున్న సినిమాలు ఆధార‌ప‌డిఉంటాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ