Advertisementt

బన్నీ కోసం ఎదురుచూపులు..!

Thu 03rd Mar 2016 03:58 PM
allu arjun,sarainodu,lingu swamy,vikram k kumar   బన్నీ కోసం ఎదురుచూపులు..!
బన్నీ కోసం ఎదురుచూపులు..!
Advertisement
Ads by CJ

మొత్తానికి 'రేసుగుర్రం' నుండి అల్లుఅర్జున్‌ దశ తిరిగింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి' చిత్రాలతో ఆయన ఇమేజ్‌ పీక్స్‌కు వెళ్లింది. కాగా ప్రస్తుతం బన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ పతాకంపై చేస్తున్న 'సరైనోడు' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఇప్పటివరకు 65కోట్లకు పైగానే జరిగిందని, ఈ చిత్రం కూడా సూపర్‌హిట్టు అయితే బన్నీ టాప్‌3లో చేరడం ఖాయం అంటున్నారు. కాగా ప్రస్తుతం బన్నీ క్రేజ్‌ సామాన్యంగా లేదు. ఒకేసారి ఇద్దరు ముగ్గురు టాప్‌ డైరెక్టర్స్‌ ఆయనతో చిత్రాలు చేయడానికి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ బన్నీతో హ్యాట్రిక్‌ మూవీ చేయాలని భావిస్తున్నాడు. బన్నీ-నాగార్జుల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌కు స్టోరీ రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు సూర్యతో చేస్తున్న '24' చిత్రం తర్వాత 'ఇష్క్‌, మనం' చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌తో ఓ చిత్రం బన్నీ చేయనున్నాడట. ఇక క్యూలో మరో తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి కూడా ఉన్నాడు. ఫిల్మ్‌నగర్‌ సమాచారం ప్రకారం బన్నీ 'సరైనోడు' తర్వాత చేసే చిత్రం విక్రమ్‌.కె.కుమార్‌దే అని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ