Advertisementt

మహేష్‌, రామ్‌చరణ్‌ల ముందుచూపు..!

Fri 04th Mar 2016 02:44 PM
ram chran tej,mahesh babu,real estate,shoban babu  మహేష్‌, రామ్‌చరణ్‌ల ముందుచూపు..!
మహేష్‌, రామ్‌చరణ్‌ల ముందుచూపు..!
Advertisement
Ads by CJ

స్థలాల మీద, సిరాస్థుల మీద పెట్టుబడి పెట్టడం సినిమా జనాలకు కొత్తేమీ కాదు. గతంలో స్వర్గీయ శోభన్‌బాబు నుండి నిన్నటి మురళీమోహన్‌, నాగార్జున వరకు అదే బాటలో నడిచి ఆచరించినవారే. కాగా ఇప్పుడు యంగ్‌ స్టార్స్‌.. మరీ ముఖ్యంగా మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లు ఇదే రూట్‌ను ఫాలో అవుతున్నారు. ఈమధ్యకాలంలో స్థలాలు కొనడం విషయంలో వీరిద్దరు యమా ఫాస్ట్‌గా ఉన్నారు. మొదట హైదరాబాద్‌లోనే పలు స్థలాలను వీరు కొన్నారు. కానీ ఇక్కడ రియల్‌ఎస్టేట్‌ బూమ్‌ పడిపోయింది. దాంతో వారి దృష్టి ఇప్పుడు ముంబైపై పడింది. ఈమేరకు మహేష్‌, రామ్‌చరణ్‌లు ముంబైలోని స్థలాలపై పెట్టుబడి పెట్టడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. తమకు బాలీవుడ్‌లో ఉన్న పరిచయాలతో వాళ్లు ముందుకు సాగుతున్నారు. ముందుగా వారు ముంబై వెళ్లినప్పుడు ఉండటానికి లావిష్‌గా ఉండే హౌస్‌లు. ఫామ్‌హౌస్‌లను రిచ్‌ ఏరియాలో కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో సినిమాలు తీసినప్పుడు అక్కడ ఉండటం కోసం ఈ స్థలాలను కొంటున్నామని చెబుతున్నప్పటికీ దాని వెనుక బిజినెస్‌ రీజన్స్‌ కూడా ఉన్నాయి. వీరే కాక వీరి బాటలో మరికొందరు స్టార్స్‌ కూడా ముంబైలోని ఖరీదైన స్థలాలు, అపార్ట్‌మెంట్స్‌ వంటి వాటిపై కన్నేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ