కింగ్ నాగార్జున, తమిళ యంగ్‌స్టార్ కార్తీల కాంబినేషన్‌లో తమన్నా లీడ్‌రోల్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఊపిరి'. ఈ చిత్రాన్ని మార్చి 25న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ చిత్ర విజయంపై నలుగురు భారీ ఆశలు పెట్టుకొన్నారు. ఈ చిత్రం మెయన్‌టీమ్‌లోని నాగార్జున, కార్తి, తమన్నా, వంశీపైడిపల్లి వంటి నలుగురు హాట్రిక్‌పై కన్నేశారు. ఈ చిత్రం హిట్ అయితే ఈ నలుగురుకి హ్యాట్రిక్ సొంతం అవుతుంది. నాగార్జున విషయానికి వస్తే.. 'మనం, సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల ఘనవిజయంతో వరుస హిట్స్‌తో ఖుషీగా ఉన్న నాగ్‌కు 'ఊపిరి'హిట్ అయితే హ్యాట్రిక్ సొంతం అవుతుంది. ఇక కార్తీ విషయానికి వస్తే.. ఆయన ఈ చిత్రం ముందు చేసిన తమిళ చిత్రాలైన 'మద్రాస్, కొంబన్' చిత్రాలు మంచి విజయాలను నమోదుచేశాయి. సో.. 'ఊపిరి' హిట్ అయితే కార్తీకి కూడా హ్యాట్రిక్ సొంతం అవుతుంది. కాగా ఆ మధ్య వరుసగా పరాజయాలను చవిచూసిన హీరోయిన్ తమన్నా 'బాహుబలి, బెంగాల్‌టైగర్' చిత్రాల విజయంతో మరలా ఊపులోకి వచ్చింది. 'ఊపిరి' కూడా హిట్ అయితే ఆమెకు కూడా హాట్రిక్ లభించినట్లు అవుతుంది. ఇక దర్శకుడు వంశీపైడిపల్లి విషయానికి వస్తే ఆయన ఈ చిత్రానికి ముందు చేసిన 'బృందావనం, ఎవడు' చిత్రాలు మంచి హిట్స్‌గా నిలిచాయి. 'ఊపిరి' సక్సెస్‌పై ఆయన హ్యాట్రిక్ ఆధారపడివుంది. మొత్తానికి 'ఊపిరి' చిత్రంపై నలుగురు హాట్రిక్ విజయాలపై ఆశలు పెట్టుకొన్నారు.