విక్టరీ వెంకటేష్‌కు, రీమేక్‌లకు విడదీయరాని బందం ఉంది. తమిళ, మలయాళ, హిందీ, కన్నడ.. ఇలా ఏ భాషా చిత్రమైనా తనను ఆకట్టుకుంది అంటే వెంటనే వాటిపై కన్నేసే హీరో వెంకటేష్. ఆయన కెరీర్‌లో వచ్చిన హిట్స్‌లో రీమేక్‌లే ప్రధానంగా కనిపిస్తాయి. ఇటీవల ఆయన చేసిన 'దృశ్యం, గోపాల గోపాల' చిత్రాలు కూడా రీమేక్‌లే కావడం గమనించాల్సిన అంశం. తాజాగా ఆయన మరో తమిళ చిత్రంపై మనసుపడ్డాడని సమాచారం. తమిళంలో కొద్ది కాలంలోనే వరుస విజయాలతో స్టార్‌గా ఎదిగిన విజయ్ సేతుపతి నటించిన 'సేతుపతి' చిత్రం తమిళంలో అద్బుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రానికి అరుణ్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రం తమిళంలో ఫిబ్రవరి 19న విడుదలై పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని చూసిన వెంకీ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. కాగా ప్రస్తుతం ఆయన మారుతితో 'బాబు బంగారం' చిత్రంతో పాటు కిషోర్ తిరుమల సినిమా, బాలీవుడ్ 'సాలా ఖద్దూస్', క్రాంతిమాధవ్ చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని, అందులో కిషోర్ తిరుమలతో చేసే చిత్రం ఈ రీమేకేనని ఫిల్మ్‌నగర్ సమాచారం.