'సరైనోడు' తర్వాత బన్నీ చేయబోయే తదుపరి చిత్రంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా లింగుస్వామితో చేస్తాడా? లేక విక్రమ్ కె.కుమార్‌తో చేస్తాడా? అనే విషయంలో అనేక రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విక్రమ్‌తో చేసే సినిమాకు చాలా గ్యాప్ ఉందని, దానికి సంబంధించిన స్టోరీలైన్ మాత్రమే ఓకే అయిందని, సూర్యతో చేస్తున్న '24' చిత్రం విడుదలైన తర్వాతే ఈ స్క్రిప్ట్‌పై విక్రమ్ దృష్టి సారిస్తాడని సమాచారం. మరోపక్క లింగుస్వామి విషయానికి వస్తే ఆయన చిత్రానికి సంబంధించిన బైండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది. మొత్తానికి మొదటిసారిగా తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందే ద్విభాషా చిత్రమైన లింగుస్వామి సినిమాను తమిళంలో స్డూడియోగ్రీన్ సంస్థ నిర్మించనుందని, తెలుగు వెర్షన్‌ను గీతాఆర్ట్స్ బేనర్‌లో నిర్మించనున్నారని సమాచారం. కాగా ఈచిత్రం మేనెల నుండి సెట్స్‌పైకి వెళ్తుందని విశ్వసనీయ సమాచారం.