Advertisementt

ఫైనల్ డెసిషన్ రామ్‌చరణ్‌దే!

Sat 05th Mar 2016 01:12 PM
ram charan,dhruva,thani oruvan remake,ram charan decision on thani oruvan remake,surendar reddy  ఫైనల్ డెసిషన్ రామ్‌చరణ్‌దే!
ఫైనల్ డెసిషన్ రామ్‌చరణ్‌దే!
Advertisement
Ads by CJ

'బ్రూస్‌లీ' పరాజయం తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు రామ్‌చరణ్. అందుకే 'బ్రూస్‌లీ' తర్వాత నటించబోయే తదుపరి చిత్రం కోసం ఎన్నో కథలు విని చివరిగా ‘తను ఒరువన్’ రీమేక్‌ను ఎంచుకున్నాడు. మొదట్నుంచీ ఈ రీమేక్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే చేయాలని నిర్ణయించుకున్నాడు రామ్‌చరణ్. అయితే సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిక్-2’ ఘోర పరాజయం కావడంతో చరణ్ క్యాలిక్‌లేషన్స్ మారాయి. దర్శకుడిని కూడా మారిస్తే ఎలా వుంటుందని కూడా ఆలోంచించాడట. ఆ సమయంలోనే అల్లు అరవింద్ జోక్యంతో చరణ్ ఆ ఆలోచనను విరమించుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్ దగ్గర్నుంచీ.. మొదలుకొని ప్రతి  చిన్న ఆర్టిస్ట్ ఎంపికలో కూడా చరణ్ జోక్యం చేసుకుంటున్నాడట. అన్నింట్లోనూ చరణ్‌దే ఫైనల్ డెసిషన్. అంతేకాదు సురేందర్ రెడ్డితో పాటు చరణ్ కూడా ప్రత్యేక రచయితలను పెట్టుకుని  ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను చేయించాడట. ఇటీవలే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ