Advertisementt

మొత్తానికి అక్కడ ఓకే అయింది!

Sat 05th Mar 2016 09:02 PM
ayesha sharma,rouge movie,puri jagannath,varun dhavan  మొత్తానికి అక్కడ ఓకే అయింది!
మొత్తానికి అక్కడ ఓకే అయింది!
Advertisement
Ads by CJ

కొందరు హీరోయిన్స్‌ కెరీర్‌లు చాలా చిత్రంగా మొదలవుతాయి. కెరీర్‌ ప్రారంభంలో చాలా సినిమాలు మొదలయినా అవి ఆగిపోవడమో, లేదా మూలన పడటమో జరుగుతుంటాయి. స్టార్‌డమ్‌ వచ్చే వరకు ఏదీ నికరంగా ఉండదు.మోడలింగ్‌లో ఓ స్థాయికి చేరి సినిమా ఫీల్డ్‌లో దెబ్బలు తిని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది హీరోయిన్‌ ఆయేషాశర్మ. నేహాశర్మ చెల్లెలు అయిన ఈ భామ పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతూ ఆగిపోయిన 'రోగ్‌' చిత్రంలో మొదట హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ ఆ సినిమా ఆగిపోకముందే ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఈమెపై బ్యాంకాక్‌లో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా జరిగింది. ఇక రామ్‌ హీరోగా వచ్చిన 'శివం' చిత్రంలో మొదట ఈమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ నుండి కూడా తప్పుకుంది. కారణాలైతే తెలియదు కానీ ఇలా ఆమె నటించాల్సిన రెండు చిత్రాల్లో ఆమెకు ఎంట్రీ లభించలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌కు వెళ్లి హాట్‌ హాట్‌ లుక్స్‌తో, బికినీలో రెచ్చిపోయి ఫొటో షూట్‌ చేసింది. ఈ ఫొటోలను, అమ్మడు హాట్‌ స్టిల్స్‌ను చూసిన ఆమెకు వరుణ్‌దావన్‌ హీరోగా నటిస్తున్న 'జుద్వా2'లో హీరోయిన్‌గా ఎంపికైంది. మరి ఈ సినిమా అయినా పూర్తై విడుదల అవుతుందా? అనే దానిపై ఇప్పుడు ఈ అమ్మడు భవిష్యత్తు ఆధారపడివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ