Advertisementt

యూ ట్యూబ్ లో సూర్య '24' సంచలనం!

Sun 06th Mar 2016 01:17 PM
suriya,24 movie,24 movie youtube sensation,samantha,nithya menon,manam vikram kumar,nithiin,suriya 24 movie teaser  యూ ట్యూబ్ లో సూర్య '24' సంచలనం!
యూ ట్యూబ్ లో సూర్య '24' సంచలనం!
Advertisement
Ads by CJ

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా సూర్య '24'.

సూర్య హీరోగా  'మనం'  ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం, '24'. శ్రేష్ట్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ సమర్పణలో  ఈ చిత్రాన్ని 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా  నిర్మిస్తున్నారు.. 2016 మోస్ట్ ఎవేటెడ్ మూవీగా వస్తోన్న '24' సినిమా కోసం  సౌత్  ఇండియన్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చెస్తోంది.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు టీజర్ ను యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించారు. 

కధాకధనాలతో పాటు సాంకేతికంగా హై స్టాండెట్స్ లో తెరకెక్కుతోన్న '24' ఆడియెన్స్ కు ఓ సరికొత్త థ్రిల్ ను అందిస్తుందని,  తిరు , ఎ.ఆర్ రెహ్మాన్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ కలయికలో విక్రమ్ కుమార్  విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని,  విడుదల చేసిన కొన్ని గంటల్లోనే  '24' టీజర్ కు 10 లక్షలకు పైగా వ్యూస్ రావటం ఈ సినిమాకున్న క్రేజు కు నిదర్శనమని నిర్మాత జ్ఞానవేల్ రాజా  తెలిపారు..

సూర్య ,సమంత, నిత్యమీనన్, అజయ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాటోగ్రఫీ: తిరు, కూర్పు: ప్రవీణ్ పూడి. సమర్పణ: శ్రేష్ట్ మూవిస్ - గ్లోబల్ సినిమాస్, నిర్మాత : జ్ఞానవేల్ రాజా, రచన- దర్శకత్వం: విక్రమ్ కుమార్.

Click Here to See the Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ