Advertisementt

రవితేజపై ఇక డౌట్ తీరినట్లేనా..!

Sun 06th Mar 2016 01:38 PM
raviteja,six pack,rabinhood,massraja,raviteja six pack photo,raviteja movies  రవితేజపై ఇక డౌట్ తీరినట్లేనా..!
రవితేజపై ఇక డౌట్ తీరినట్లేనా..!
Advertisement
Ads by CJ

సినీ నేపథ్యం లేకుండా స్టార్‌హీరోగా ఎదిగిన కథానాయకుడు రవితేజ. చిన్న చిన్న వేషాలతో మొదలైన ఆయన సినీప్రస్థానం... 10కోట్ల పారితోషికం అందుకునే రేంజ్‌కు చేరింది. ఐదు పదుల వయసులో వున్న ఈ మాస్ హీరో గత కొంతకాలం నుంచి ప్రత్యేక డైట్‌ను పాటిస్తూ సన్నబడ్డాడు. అయితే ఆ ప్రాసెస్‌లో రవితేజ ఫేస్‌లో మునుపటి కళ మిస్ అయ్యింది. దీంతో కొంతకాలం పబ్లిక్ ఫంక్షన్‌లకు దూరంగా వున్నాడు రవితేజ. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యం బాగాలేదని పుకార్లు కూడా వినిపించాయి. అందులో నిజం వుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. అందరికి మాత్రం అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా ఆ పుకార్లపై సందేహం అయితే వుండేది. అయితే తాజాగా విడుదలైన రవితేజ సిక్స్‌ప్యాక్ ఫోటోలు చూడగానే అందరీ సందేహలు తీరిపోయాయి. ఐదు పదుల వయసులో కూడా సిక్స్‌ప్యాక్ చేసి రవితేజ తన ఆరోగ్యం భేష్‌గా వుందని చెప్పకనే చెప్పాడు.. సో.. త్వరలోనే రవితేజను ఆయన తాజా సినిమాలో ఆరుపలకల దేహంతో చూడబోతున్నాం..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ