Advertisementt

రష్మీ అందానికి 4 కోట్లు!

Sun 06th Mar 2016 04:22 PM
rashmi gautham,guntur talkies  రష్మీ అందానికి 4 కోట్లు!
రష్మీ అందానికి 4 కోట్లు!
Advertisement
Ads by CJ

జబర్దస్త్ భామ రష్మీ గౌథమ్ ఇంతకుమునుపే సినిమాలలోకి ఆరంగేట్రం చేసినా టీవీ స్క్రీన్ మీద సంపాదించిన పేరు, ప్రఖ్యాతలు ఇక్కడ వెండి తెర మీద రాలేదనే చెప్పుకోవాలి. కానీ ఇదంతా నిన్నటి మాట. ఇక తాజా కబురు ఏంటంటే, రష్మీ నటించిన గుంటూరు టాకీస్ చిత్రం ధియేటర్లలో దుమ్ము రేపుతోంది. సినిమా ఆరంభం నుండీ ఇది పక్కాగా పెద్దవారికి మాత్రమే అంటూ A సర్టిఫికేట్ బొమ్మ చూపిస్తూ ఊరించిన నిర్మాతలు అండ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు నిజంగానే మాటను నిలబెట్టుకున్నారు. ఈ రోజు గుంటూరు టాకీస్ అసలు ఆకర్షణ రష్మీ అందాల ఆరబోత అండ్ శ్రద్దా దాస్ శృంగార విశృంఖలత్వం అంటూ బయటచ్చిన ప్రతి రసికోత్తమ ప్రేక్షకుడు తన్మయత్వంతో చెబుతున్నారు. మరి ఇంతలా మగ కుర్రకారు హృదయాలని దోచేసింది కనకనే బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం శుక్రవారం, శనివారం కలిపి 4.25 కోట్ల గ్రాస్ గుంటూరు టాకీస్ కలెక్ట్ చేసింది. ఈరోజు అనగా ఆదివారం కూడా గుంటూరు టాకీస్ సినిమా హాల్స్ జనాల కిటకిటతో వేడి అవటం  ఖాయం. అదీ మరి జబర్దస్త్ భామ లెక్క! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ