Advertisementt

పరీక్షలున్నాయి, అందుకే రాలేదు!

Mon 07th Mar 2016 12:18 AM
malavika nair,kalyana vaibhogame  పరీక్షలున్నాయి, అందుకే రాలేదు!
పరీక్షలున్నాయి, అందుకే రాలేదు!
Advertisement
Ads by CJ

కళ్యాణ వైభోగమే చిత్రంలో ప్రథమ ఆకర్షణ హీరోయిన్ మాళవిక నాయర్. మొదటగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చూసినప్పుడే ఈ అమ్మాయిలో స్పార్క్ ఉందని గమనించిన ప్రేక్షకులు ఇక ఈ మూవీతో అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. కళ్యాణ వైభోగమేలో పెళ్లీడుకు వచ్చిన పెద్దమ్మాయిగా చూపించినా ఈ అమ్మాయి వయసు మాత్రం పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా దాటలేదు. నిజమండీ. ఓపెనింగ్ టాక్ బాగుండడంతో, సినిమా ప్రమోషన్స్ కోసం మాళవికను ఒకసారి హైదరాబాద్ వచ్చిపోమని అడిగితే ప్రస్తుతం తనకు ఏడాది పరీక్షలు జరుగుతున్నాయని, అందుకోసం గట్టి ప్రిపరేషన్ చేస్తున్నానని, తన ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయితే గానీ కేరళ దాటి రాలేనని తెగేసి చెప్పిందట ఈ కేరళ కుట్టి. కేరళ అంటేనే సహజ సిద్ధంగా నటించి, అందంతో పాటు అభినయంలో కూడా ఆరితేరిన వనితలకు పెట్టింది పేరు. ముందుగా నిత్య మీనన్, ఇక ఇప్పుడేమో అందరూ మాళవిక గూర్చి మాట్లాడుకుంటున్నారు. మరికొందరు కుట్టీలైన కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కూడా తెలుగులోకి కాలు మోపుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ