Advertisementt

ఇలియానా భయం వెనుక కారణం ఇదా!

Mon 07th Mar 2016 01:40 PM
ileana,rustom movie,akshay kumar,asin,kajal,tapsee,ileana fearing with sentiment  ఇలియానా భయం వెనుక కారణం ఇదా!
ఇలియానా భయం వెనుక కారణం ఇదా!
Advertisement
Ads by CJ

గోవాబ్యూటీ ఇలియానాకు ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌తో చేసే అవకాశం వచ్చింది. అక్షయ్‌ హీరోగా రూపొందుతున్న 'రుస్తుం' చిత్రంలో ఆమె నటిస్తోంది. అయినా కూడా ఇలియానా మొహంలో సంతోషం కనిపించడం లేదు. దీనికి ఓ బ్యాడ్‌సెంటిమెంట్‌ కారణంగా బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సౌత్‌హీరోయిన్లకు అక్షయ్‌కుమార్‌ ఇప్పటివరకు పెద్దగా కలిసి రాలేదు. 'ఖిలాడీ 786'లో నటించిన అసిన్‌, 'స్పెషల్‌ చబ్బీస్‌'లో నటించిన కాజల్‌ అగర్వాల్‌, 'బేబి' చిత్రం తర్వాత తాప్సిలు బాలీవుడ్‌ నుండి కనుమరుగైపోయారు. అక్షయ్‌కుమార్‌తో నటించిన ఈ చిత్రాలు విజయం సాధించినప్పటికీ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన హీరోయిన్లు మాత్రం తెరమరుగవుతున్నారు. మరలా తన విషయంలో కూడా ఇదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందా? అనే భయం ఇలియానాలో మొదలైంది. అందుకే ఆమె అంతలా కంగారుపడుతోందని, సినిమాలో అవకాశం వచ్చిన సంతోషం ఆమెలో కనిపిచడం లేదని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ