Advertisementt

బాలయ్య 100కి నిర్మాతలు ఖరారు!

Mon 07th Mar 2016 01:50 PM
balakrishna,sai korrapati,14 reels entertainment,mokshu,balakrishna 100th film producers  బాలయ్య 100కి నిర్మాతలు ఖరారు!
బాలయ్య 100కి నిర్మాతలు ఖరారు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నందమూరి అభిమానులందరూ రెండు చిత్రాల విషయంలో ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో ఒకటి బాలకృష్ణ నటించే 100వ చిత్రం కాగా, రెండోది బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రం. అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకులు ఖరారు కానప్పటికి ఈ చిత్రాలను నిర్మించే నిర్మాతలు మాత్రం ఖరారైనారు. ఈ రెండు చిత్రాలపై వారాహిచలనచిత్రం బేనర్‌ అధినేత సాయి కొర్రపాటి పెదవి విప్పాడు. బాలయ్య నటించే చిత్రాన్ని ఇంతకు ముందు 'లెజెండ్‌'ను తెరకెక్కించిన తమ వారాహిచలనచిత్రం బేనర్‌తో కలిసి 14రీల్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నాయని ఆయన తేల్చారు. అయితే ఈ చిత్రం దర్శకుడి విషయంలో మాత్రం ఆయన నోరు విప్పలేదు. ఇక నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించే చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించనున్నానని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్ర దర్శకుడి విషయంలో కూడా సాయికొర్రపాటి నోరు విప్పలేదు. మొత్తానికి ఎస్‌. గోపాల్‌రెడ్డి తర్వాత మరలా బాలయ్యకు అంత దగ్గరైన నిర్మాతగా సాయి కొర్రపాటి ఉన్నాడని, అందుకే బాలయ్య తన నమ్మినబంటుగా ఉన్న సాయికి ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించే చిత్రాల బాధ్యతను ఆయన భుజస్కందాలపై పెడుతున్నాడని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ