నారా రోహిత్ సోలో గా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఊరందరిది ఒక దారి ఉలిపిరి కట్టెది ఒక దారి అనేలా తనకి నచ్చిన స్క్రిప్ట్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆరు సినిమాల్లో నటిస్తున్నాడు నారా రోహిత్. అయన లేటెస్ట్ సినిమా 'తుంటరి' విడుదలకు సిద్దం అయింది. ఈ సినిమా పై నారా రోహిత్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన మాన్ కరాటే సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ అందించిన కథతో ఈ సినిమా రూపొందుతుంది కాబట్టి సినిమాపై గట్టి నమ్మకం తోనే ఉన్నాడు నారా వారబ్బాయి. మరి ఈ తుంటరి నమ్మకాన్ని మురుగదాస్ నిజం చేస్తాడేమో చూడాలి.