పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. అయితే ఇది ఏ తెలుగు అభిమానులను అడిగినా చెబుతారు, కానీ బాలీవుడ్ కి చెందిన ఓ లేడి జర్నలిస్ట్ కూడా పవన్ పై ఇష్టం పెంచుకోవడం విశేషం. ఆ లేడి జర్నలిస్ట్ కు సినిమా విడుదలకు ముందే పవన్ ను ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కింది. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఇంటర్వ్యూ లు కూడా ఎక్కువగా ఇవ్వడు. అలాంటిది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లొకేషన్ లో పవన్ ని బాలీవుడ్ కి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత అనుపమ చోప్రా ఇంటర్వ్యూ చేసింది. గత 2, 3 రోజులుగా ఇదే హాట్ టాపిక్ ఇండస్ట్రీ లో నడుస్తుంది. ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలు పవన్ ఆమెకి చెప్పాడట ! అంతే కాకుండా పవన్ కళ్యాణ్ చాలా డౌన్ టు ఎర్త్ గా సమాధానాలు చెప్పడంతో ఆమె పవన్ వ్యక్తిత్వానికి ఫిదా అయిందట ! పవన్ తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయనపై మనసు పారేసుకున్నా అంటూ ఆమె చెప్పడం విశేషం.