Advertisementt

బాలయ్య 'గోల తాతయ్య' అంట!

Fri 11th Mar 2016 06:53 PM
balakrishna,gola tatayya,balayya gola tatayya katha,nara devansh  బాలయ్య 'గోల తాతయ్య' అంట!
బాలయ్య 'గోల తాతయ్య' అంట!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ బొళామనిషి, మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది మొహానే మాట్లాడేస్తాడు అనేది నందమూరి అభిమానుల వాదన. ఈ వాదన నిజమే అని ఒప్పుకోవాలి. అందువల్లే బాలయ్య అప్పుడప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తాజాగా ఆయన మహిళల పట్ల చేసిన కామెంట్స్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఈ విషయంలో వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. బాలయ్య బయటే కాదు... ఇంట్లో కూడా అల్లరి అల్లరి చేస్తాడట. కొంటెపనులు, చిలిపి చేష్టలు ఈయనకు మామూలేనట. ముఖ్యంగా ఇంట్లో వారితో అల్లరి చేసే సమయంలో పిల్లాడిలా మారిపోతాడట. ఇక తన మనవడు నారా దేవాన్ష్‌తో ఆడుకొనే విషయంలో ఆయన అల్లరి శృతిమించుతుందని, దాంతో ఇంట్లోని అందరూ బాలయ్యను 'గోల తాతయ్య' అని పిలుస్తారని ఇటీవల ఆయన కుమార్తె బ్రాహ్మణి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపింది. అదీ మన బాలయ్య 'గోల తాతయ్య' కథ...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ