Advertisementt

తమ్ముడి దారిలోనే అన్న కూడా!

Fri 11th Mar 2016 07:55 PM
suriya,suriya follows karthi,telugu dubbing,oopiri audio,suriya 24 movie  తమ్ముడి దారిలోనే అన్న కూడా!
తమ్ముడి దారిలోనే అన్న కూడా!
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్షకులకు దగ్గరై మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ యంగ్‌స్టార్‌ కార్తి తన రెండో చిత్రం 'అవారా' నుండి తెలుగు డబ్బింగ్‌ వెర్షన్స్‌కు తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆయన నాగార్జునతో కలిసి నటిస్తున్న 'ఊపిరి' చిత్రంలోని తన పాత్రకు ఆయనే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాడు. కానీ ఎప్పుడో వచ్చిన 'గజిని' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తి అన్నయ్య, తమిళ స్టార్‌హీరో సూర్య ఆ తర్వాతి నుండి తమిళంలో తాను చేసిన ప్రతి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఇక్కడ కూడా తనకంటూ ఓ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. కానీ సూర్య ఇప్పటివరకు సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పకుండా డబ్బింగ్‌ ఆర్టిస్‌లపైనే ఆధారపడుతున్నాడు. అయితే  త్వరలో  'మనం' ఫేమ్‌ విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ఫిక్షన్‌ చిత్రం '24' చిత్రంలో మూడు విభిన్న పాత్రలు చేస్తున్నాడు. ఇందులోని ఓ పాత్రకు సూర్య తెలుగులో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటుండటం విశేషం. ఇందులో సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరు కూడా సొంతగా తెలుగు డబ్బింగ్‌ చెప్పుకుంటుండటం గమనార్హం. సొంతగా డబ్బింగ్‌ చెప్పుకుంటే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరకావచ్చనే ఉద్దేశ్యంతో పాటు త్వరలో ఆయన స్ట్రైయిట్‌ తెలుగు చిత్రం చేస్తుండటంతో ఇక నుండి తన వాయిస్‌నే వాడాలని, ఇలా తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరై సొంత వాయిస్‌తో మెస్మరైజ్‌ చేయాలని సూర్య భావిస్తున్నాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ