'అలా మొదలైంది' వంటి అర్బన్ ప్రేమకథను తీసుకొని దానికి అద్భుతమైన స్క్రీన్‌ప్లే తయారుచేసుకొని పెద్ద విజయం సాధించింది నందిని రెడ్డి. ఆ తర్వాత 'జబర్ధస్త్' చిత్రంతో కాపీ క్యాట్‌గా విమర్శలపాలైంది. కానీ చాలాకాలం గ్యాప్ తీసుకొని ఆమె తీసిన 'కళ్యాణవైభోగమే' చిత్రంతో మరోసారి మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను, సినీ విమర్శకులను మెప్పించింది. వాస్తవానికి తెలుగులో విజయనిర్మల తర్వాత సరైన లేడీ డైరెక్టర్ ఎవ్వరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అదే బాలీవుడ్ విషయానికి వస్తే అక్కడ పలువురు మహిళా దర్శకులు స్టార్స్‌తో సైతం చిత్రాలు తీస్తున్నారు. కాగా త్వరలో నందిని రెడ్డికి ఓ భారీ నిర్మాత ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక నందిని రెడ్డితో రంజిత్ మూవీస్ బేనర్‌లో 'అలా మొదలైంది, కళ్యాణవైభోగమే' చిత్రాలను నిర్మించిన కె.ఎల్. దామోదర్ ప్రసాద్ త్వరలో ఆమెతో హ్యాట్రిక్‌మూవీని తీయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తంగా చూస్తే భవిష్యత్తులో నందిని రెడ్డి నుండి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉందనే అంటున్నారు.