Advertisementt

ముందుగా త్రిషను మెచ్చుకోవాలి!

Tue 15th Mar 2016 12:33 AM
trisha,nayaki,sathyam rajesh,director govi  ముందుగా త్రిషను మెచ్చుకోవాలి!
ముందుగా త్రిషను మెచ్చుకోవాలి!
Advertisement
Ads by CJ

స్టార్ హీరోయినుగా చిరంజీవిలాంటి బడా బడా హీరోల సరసన నటించిన లెవెల్ నుండి ఇప్పుడు సత్యం రాజేష్ లాంటి కమెడియన్ నుండి హీరోగా ఎదుగుతున్న వారితో నటించడం ఒక్క త్రిషకే చెల్లింది. నాయకీ అనే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష సరసన సత్యం రాజేష్ హీరో అన్న సంగతి చానా మందికి మింగుడు పడకపోయినా ఇది నిజం అంటున్నారు. లవ్ యు బంగారం అనే ఓ వింత రొమాంటిక్ చిత్రానికి ఇంతకు ముందు దర్శకత్వం వహించిన గోవి, అదే గోవర్ధన్ ఇప్పుడు నాయకీని తయారు చేస్తున్నాడు. త్రిష పక్కన తనని అస్సలు జీర్ణించుకోలేకపోతున్న సత్యం రాజేష్ క్రెడిట్ మొత్తం దర్శకుడిదే అంటూ గోవికి నమస్కారం పెడుతున్నాడు. ఇండస్ట్రీ జనాలు, అదేంటి రాజేషుతో ఎందుకు రిస్క్ అని బెదరగొట్టినా గోవి మాత్రం తనను నమ్మాడని చెబుతున్నాడు. మొన్నే క్షణం చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో మంచి హీరోయిజం పండించిన రాజేష్ పంట మరోసారి పండినట్టే. ఇక నాయకీ హిట్టయితే సోలో హీరో ఆఫర్లు కూడా వస్తాయేమో.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ