Advertisementt

చెర్రీ తనతో ఎఫైర్ లేదంటున్నాడు!

Wed 16th Mar 2016 03:47 PM
ram charan tej,upasana,sania mirza,sreeja  చెర్రీ తనతో ఎఫైర్ లేదంటున్నాడు!
చెర్రీ తనతో ఎఫైర్ లేదంటున్నాడు!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్, సానియామీర్జా ల మధ్య ఎఫైర్ నడుస్తుందని చెర్రీ తొందరలోనే తన భార్య ఉపాసనకు విడాకులు ఇవ్వబోతున్నాడని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంతోకాలంగా హైదరాబాద్ లో జరుగుతున్న ప్రతి పార్టీకు రామ్ చరణ్, ఉపాసనలతో కలిసి సానియా మీర్జా కూడా వస్తుండటంతో ఈ వార్తలు నిజమే అయ్యి ఉంటాయని టాక్ వచ్చింది. సానియా మీర్జా కారణంగా రాంచరణ్‌, ఉపాసనల మధ్య వ్యవహారం చెడి ఉంటుందని చాలా మంది నమ్మారు. ఈ వార్తలు మెగాభిమానులకు, మెగా సన్నిహితులకు తీవ్ర ఆందోళనను కలిగించాయి.

దీంతో ఈ విషయంపై రామ్ చరణ్ స్పందించాడు. తనకు సానియాకు ఎలాంటి ఎఫైర్ లేదని, మేము స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేశాడు. అలానే తనకు, ఉపాసనకు మధ్య విడాకుల టాపిక్ రాలేదని, అసలు ఉపసనకు విడాకులు ఇచ్చే ఆలోచనే లేదని వెల్లడించాడు. ప్రస్తుతం నేను, నా భార్య ఉపాసన, నా చెల్లెలు శ్రీజ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నామని, దయచేసి ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేయొద్దు, నమ్మొద్దు అని మీడియాకు తెలియజేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ