Advertisementt

చిరు విషయంలో పవన్ జోక్యం అవసరమా..?

Wed 16th Mar 2016 04:01 PM
chiranjeevi 150th film,pawan kalyan,sardhar gabbar singh  చిరు విషయంలో పవన్ జోక్యం అవసరమా..?
చిరు విషయంలో పవన్ జోక్యం అవసరమా..?
Advertisement
Ads by CJ

చిరంజీవి 150 వ సినిమా విషయంలో రోజుకో వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 150 వ సినిమాలో పవన్ జోక్యం చేసుకోబోతున్నాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ చివరి వారానికి సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి నిర్విరామంగా షూటింగ్ నిర్వహించి నవంబర్ నాటికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు చిరంజీవి, పవన్ ల మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే వార్తలు హల్ చల్ చేశాయి. 

కాని 'సర్దార్' సెట్ కు వెళ్లి సినిమా ఎలా జరుగుతుందో.. చూసి వచ్చాడు చిరు. అలానే చిరంజీవిను కూడా ఈ మధ్య తరచూ కలుస్తున్నాడు తమ్ముడు పవన్ కళ్యాన్. ఇలాంటి తరుణంలో తన అన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 150 వ సినిమాలో పవన్ పాటలు, ఫైట్స్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన మెగాభిమానులు మొదట సంతోషపడినా.. చిరు సినిమా విషయంలో పవన్ ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నారు. సినిమా హిట్ అయితే ఓకే గానీ.. అనుకోనిది ఏమైనా.. జరిగితే ఆ మచ్చ పవన్ పై ఎప్పటికి ఉండిపోతుందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ