Advertisementt

ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగిందా..?

Wed 16th Mar 2016 05:42 PM
ntr,janatha garage,mythri movies,koratala siva  ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగిందా..?
ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగిందా..?
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బొంబాయిలో జరుగుతుంది.  అయితే ఈ సినిమా విశేషాల గురించి మైత్రీ మూవీస్ సంస్థ ట్విట్టర్ లో 'సినిమా షూటింగ్ బాగా జరుగుతోందని, నిత్యమీనన్ నిన్నటి నుండి షూటింగ్ లో జాయిన్ అయిందని.. ఇదే వారంలో సమంత కూడా షూటింగ్ లో పాల్గొననుందని తెలియజేశారు'. నిజానికి మొదట ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగిందని పోస్ట్ చేసిన మైత్రి మూవీస్ వారు వెంటనే దానిని ఇనాక్టివ్ చేసేసారు. అంతలో ఏం జరిగింది..? నిజంగానే ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగిందా...? లేక పొరపాటున పోస్ట్ చేసారా..? అనే విషయాలు తెలియడం లేదు. ఈ విషయం గురించి నిర్మాతలు క్లారిటీ ఇస్తే పర్లేదు.. లేకుండా ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందే అవకాశాలున్నాయి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ