Advertisementt

స‌ర్దార్ టీజ‌ర్‌: ఆ షాట్ సింప్లీ సూప‌ర్బ్‌!

Thu 17th Mar 2016 09:21 PM
gabbar singh,sardaar gabbar singh,sardaar gabbar singh teaser,pawan kalyan,bobby  స‌ర్దార్ టీజ‌ర్‌: ఆ షాట్ సింప్లీ సూప‌ర్బ్‌!
స‌ర్దార్ టీజ‌ర్‌: ఆ షాట్ సింప్లీ సూప‌ర్బ్‌!
Advertisement
Ads by CJ

హి ఈజ్ బ్యాక్ టు డు స‌మ్‌థింగ్‌. ఎస్‌... గ‌బ్బ‌ర్‌సింగ్ మ‌ళ్లీ వ‌చ్చాడు. ఈసారి స‌ర్దార్ రూపంలో. ఏదో స‌మ్‌థింగ్  చేయ‌డానికే. ఇంత‌కీ ఆ స‌మ్‌థింగ్ ఏంట‌న్న‌దే చూడాలి. వ‌చ్చీ రాగానే బ్యాడ్ గైస్ ఖ‌బ‌డ్దార్ అంటూ హెచ్చ‌రిక‌లు ఇస్తున్నాడు. గ‌న్స్ గట్స్‌తో కూడిన వ్య‌వ‌హారం అంటే అలాగే వుంటుంది మ‌రీ! ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన 'స‌ర్దార్  గ‌బ్బ‌ర్‌సింగ్' ప్ర‌మోష‌న్స్ గ‌త వారం రోజులుగా హోరెత్తిపోతున్నాయి.  ఈ జోరు సినిమా విడుద‌ల‌య్యేవ‌ర‌కు ఇలాగే ఉండేలా క‌నిపిస్తోంది. ఏప్రిల్ 8న సినిమా వ‌స్తోంది. ఈ నెల 20న పాట‌ల్ని విడుద‌ల చేస్తున్నారు. కొద్దిసేప‌టి క్రిత‌మే సాంగ్‌తో కూడిన టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. అందులో ప‌వ‌న్ స్టైల్ మ‌ళ్లీ అదిరిపోయింది. గ‌బ్బ‌ర్‌సింగ్‌లో తిక్క చూపించిన‌ట్టుగానే ఇందులోనూ కూడా అదే ర‌క‌మైన తిక్క‌నీ చూపించేలా ఉన్నాడు. పోలీస్ డ్రెస్ వేసుకొన్నా చుట్టూ గ్యాంగ్‌, వాళ్ల‌తో ఆట‌పాట‌లు.. అబ్బో అదుర్స్ అనిపించేలా ఉన్నాయిలెండి. అయితే లాస్ట్ పంచ్ మ‌న‌దైతే ఆ కిక్కే వేర‌బ్బా అన్న‌ట్టుగా టీజ‌ర్లోని లాస్ట్ షాట్ భ‌లే కిక్కిస్తోంది. పోలీసు డ్రెస్సుతో అచ్చం స‌ర్దార్‌లాగే ముస్తాబైన పిల్ల‌లతో కూడిన ఆ షాట్ సింప్లీ సూప‌ర్బ్‌. మ‌రి అది తెర‌పై ఎలా ఉందో చూడాలి. అయితే ఈ సాంగ్ టీజ‌ర్‌లో మాత్రం కాజ‌ల్ క‌నిపించ‌లేదు. 

Click Here to see the Sardaar Gabbar Singh Teaser